నాడు-నేడు పనులు 15లోపు పూర్తి చేయాల్సిందే

ABN , First Publish Date - 2021-06-22T06:43:42+05:30 IST

జిల్లాలో నాడు-నేడు పనులను జూలై 15వ తేదీలోపు పూర్తి చేయాల్సిందేనని జేసీ సిరి.. ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు.

నాడు-నేడు పనులు 15లోపు పూర్తి చేయాల్సిందే
మాట్లాడుతున్న జేసీ సిరి

అనంతపురం విద్య, జూన్‌ 21 : జిల్లాలో నాడు-నేడు పనులను జూలై 15వ తేదీలోపు పూర్తి చేయాల్సిందేనని జేసీ సిరి.. ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆమె సమగ్రశిక్ష కార్యాలయంలో నాడు-నేడు పనులు చూసే ఇంజనీర్లలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ.. నాడు-నేడు పనులు శరవేగంగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. కొ న్ని స్కూళ్లలో ప్రహరీలపై వాల్‌ ఆర్డ్‌ చాలా అందంగా చిత్రీకరించారన్నారు. దీని పై ఇతర స్కూళ్లలో సైతం శ్రద్ధ పె ట్టాలని సూచించారు. పనులు చివరి దశలో ఉన్న నేపథ్యంలో తాను పరిశీలనకు వచ్చే నాటికి ఇసుక, ఐరన్‌, సిమెంటు, ఇతర స్ర్కాప్‌ కనిపించకూడదన్నారు. ఎక్కడైనా కనిపిస్తే... అందుకు ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 9381 పనులకుగాను 8750 పూర్తయ్యాయన్నారు. చాలా వర్కులు చివరి దశలో ఉన్నాయన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్ల కారణంగా అక్కడక్కడా పనుల్లో కొంత జాప్యం ఏర్పడిందన్నారు. నాబార్డు పనుల పూర్తిలోనూ ఆలస్యమైన మాట వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. అధికారులు, ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి పెట్టి, జూలై 15 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ శామ్యూల్‌, సమగ్రశిక్ష ఏపీసీ తిలక్‌, ఈఈ శివకుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, డీఈలు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T06:43:42+05:30 IST