Abn logo
Sep 21 2021 @ 00:00AM

టోఫు... తోపు!

వీగనిజం ట్రెండ్‌ ఊపందుకుంటోంది. ప్రొటీన్‌ సప్లిమెంట్‌గా, పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వేగన్లు వాడుకునే టోఫులో  ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. అవేంటంటే...


సోయా పాలను విరిచి, గట్టి బ్లాక్స్‌ రూపంలో ఒత్తితే టోఫు తయారవుతుంది. ఆవు పాలను విరిచి, దగ్గరకు ఒత్తి జున్న తయారుచేసిన సంప్రదాయ విఽధానాన్నే దీన్లోనూ అనుసరిస్తారు. వండే విధానాన్ని బట్టి మృదువుగా, గట్టిగా, దృఢంగా, కరకరలాడుతూ... ఇలా టోఫును నచ్చినట్టు వండుకోవచ్చు. దీన్లో ప్రొటీన్‌తో పాటు.. క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, బి విటమిన్లు, ఐరన్‌, మాంగనీసు, రాగి, జింక్‌ 9 అమీనో యాసిడ్లు కూడా ఉంటాయి. టోఫుతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే...


 టోఫులోని ప్లాంట్‌ ఈస్ట్రోజెన్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచి, హృద్రోగ 

వ్యాధులను అరికడుతుంది.

 ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 

 టోఫులోని ఐసోఫ్లేవన్స్‌ ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను అనుకరిస్తాయి. ఫలితంగా టోఫు తినడం వల్ల మహిళల్లో వేడి ఆవిర్లు లాంటి మెనోపాజ్‌ లక్షణాలను తగ్గుతాయి. 

 మెనోపాజ్‌కు దగ్గరైన మహిళల్లో ఎముకల అరుగుదల పెరుగుతూ, సాంద్రత తగ్గుతుంది. క్యాల్షియం, విటమిన్‌ డి లోపం వల్ల తలెత్తే ఈ ఇబ్బందులను టోఫుతో అధిగమించవచ్చు.


ప్రత్యేకం మరిన్ని...