వేయి క్వింటాళ్లకు టోకెన్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-11-30T05:10:05+05:30 IST

వేయి క్వింటాళ్లకు టోకెన్లు ఇవ్వాలి

వేయి క్వింటాళ్లకు టోకెన్లు ఇవ్వాలి
నిరసన తెలుపుతున్న రైతులు

  •  చెంగోల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట  రైతుల నిరసన
  •  ధాన్యాన్ని పరిశీలించాకే టోకెన్ల జారీ : ఏవో

తాండూరు రూరల్‌ :  చెంగోల్‌ గ్రామంలో కొనుగోలు కేంద్రం ద్వారా  రోజుకు వేయి క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసేందుకు టోకెన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం తాండూరు వ్యవసాయ కార్యాలయం  ఎదుట  రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం వ్యవసాయాధికారులు రోజుకు 500 క్వింటాళ్లకే విక్రయించుకునేందుకు టోకెన్లు జారీ చేస్తున్నారని, రోజుకు వెయ్యి క్వింటాళ్లు విక్రయించుకునేలా టోకెన్లు ఇవ్వాలని కోరారు. గ్రామంలో 191 మంది వరి పంటపండించారని  500 క్వింటాళ్లకు టోకెన్లు  ఇస్తే  ఇబ్బందులు పడతారని  రైతులు వడ్డె హన్మంతు, పి.ఎల్లప్ప, శేఖర్‌,ఈరప్ప, మంజుల, బాలప్పలు కోరారు. ఈ విషయంపై వ్యవసాయాధికారి రజిను వివరణ కోరగా, చెంగోల్‌లో  వ్యవసాయం విస్తీర్ణాధికారి సామెల్‌ కొనుగోలు కేంద్రం వద ధాన్యాన్ని పరిశీలించిన తర్వాతనే టోకన్లు జారీ చేస్తున్నామన్నారు. వ్యవసాయ కార్యాలయం వద్ద ఎవరికీ టోకెన్లు ఇచ్చేది లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. 

Updated Date - 2021-11-30T05:10:05+05:30 IST