Abn logo
May 7 2021 @ 04:43AM

‘టోక్యో క్రీడలు రద్దు చేయాలి’

టోక్యో: ఒలింపిక్స్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌కు జపాన్‌లో మద్దతు పెరుగుతోంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీని ఉద్దేశించి ఈమేరకు ఆన్‌లైన్‌లో చేపట్టిన ప్రచారోద్యమానికి ఒక్కరోజులోనే జపాన్‌ ప్రజల నుంచి సంతకాలు వెల్లువెత్తాయి. కరోనా కొత్త వేరియంట్లతో టోక్యో, ఒసాకా, ఇతర ప్రాంతాల్లో వైరస్‌ కేసులు విజృంభిస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతాలలో ఇప్పటికే అత్యవసర పరిస్థితి విధించడంతో ఒలింపిక్స్‌ వ్యతిరేక ఉద్యమం ఊపందుకోవడం గమనార్హం. జూలై 23 నుంచి టోక్యో విశ్వ క్రీడలు జరగనున్నాయి. 

Advertisement