Tokyo Olympics : ఆస్ట్రేలియా అథ్లెట్లు కొవిడ్ భయంతో ఐసోలేషన్‌లోకి...

ABN , First Publish Date - 2021-07-29T16:54:39+05:30 IST

జపాన్ దేశంలో టోక్యో క్రీడా గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది....

Tokyo Olympics : ఆస్ట్రేలియా అథ్లెట్లు కొవిడ్ భయంతో ఐసోలేషన్‌లోకి...

టోక్యో (జపాన్): జపాన్ దేశంలో టోక్యో క్రీడా గ్రామంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ టీం సభ్యడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు కొవిడ్ భయంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. అమెరికా దేశానికి చెందిన పోల్ వాల్ట్ ప్రపంచ ఛాంపియన్ సామ్ కేన్డ్రిక్స్ కు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఆస్ట్రేలియా ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ టీంలోని పలువురు అథ్లెట్లను ముందుజాగ్రత్త చర్యగా కరోనా సోకకుండా వేర్వేరు గదుల్లో ఒంటరిగా ఉంచారు. 


ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ కొవిడ్ ప్రోటోకాల్స్ కు అనుగుణంగా ఐసోలేషన్ లో ఉంచామని ఆస్ట్రేలియా తెలిపింది. యూఎస్ కు చెందిన కేన్డ్రిక్స్ కరోనాతో ఒలింపిక్స్ క్రీడలకు దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన 63 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ టీంను వేరుగా ఉంచామని ఆస్ట్రేలియా వెల్లడించింది.ఆస్ట్రేలియా పోల్ వాల్టర్ కుర్టిస్ మార్స్ చాల్ కరోనా సోకి కేన్డ్రిక్స్ తో సన్నిహితంగా మెలిగాడని తేలడంతో క్వారంటైన్ కు తరలించారు.ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటేషన్ జరగడానికి ఒకరోజు ముదు కొవిడ్ భయంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు.


Updated Date - 2021-07-29T16:54:39+05:30 IST