టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్లకు కొవిడ్ టీకాలు వేయండి

ABN , First Publish Date - 2021-06-23T11:12:28+05:30 IST

జులై 23వతేదీన ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొననున్న అథ్లెట్లకు కొవిడ్ టీకాలు వేయాలని...

టోక్యో ఒలింపిక్స్ అథ్లెట్లకు కొవిడ్ టీకాలు వేయండి

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశం

న్యూఢిల్లీ : జులై 23వతేదీన ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొననున్న అథ్లెట్లకు కొవిడ్ టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేర అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో  పాల్గొనే అథ్లెట్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది, ప్రతినిధి బృందం సభ్యులకు కోవిషీల్డ్ రెండు డోసుల టీకాలు వేయాలని కేంద్రం సూచించింది. దీనికోసం రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ప్రత్యేకంగా కొవిడ్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులు ఎక్కువ మంది మొదటి డోసు టీకా వేయించుకున్నారని, రెండో డోసు టీకాను ప్రాధాన్యమిచ్చి వేయాలని కేంద్రం సూచించింది. విదేశాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, నేరుగా టోక్యోకు వెళ్లే అవకాశం ఉన్న అథ్లెట్లకు టీకాలు వేయాలని కేంద్రం కోరింది. 

Updated Date - 2021-06-23T11:12:28+05:30 IST