Abn logo
Aug 1 2021 @ 01:07AM

శనివారం ఓలింపిక్స్‌ ముగిసే సమయానికి టాప్ ఎవరంటే..

టోక్యో ఒలింపిక్స్ శనివారం నాటి పోటీలు ముగిసే సమయానికి 21 బంగారు పతకాలతో చైనానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. 21 బంగారు, 13 రజత, 3 12 కాంస్య పతకాలను గెలుచరుకుని మొత్తం 46 పతకాలతో టాప్‌లో కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో 17 బంగారు, 5 రజత, 8 కాంస్య పతకాలతో మొత్తం 30 పతకాలు గెలిచి జపాన్ కొనసాగుతోంది. మూడో స్థానంలో 16 గోల్డ్, 17 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్‌తో మొత్తం 46 మెడల్స్‌తో అమెరికా కొనసాగుతోంది. 

ఇక భారత్ విషయానికి వస్తే.. టోర్నీలో ఒకే ఒక్క రజత పతకంతో 60వ స్థానంలో కొనసాగుతోంది. భారత్‌తో పాటు బల్గేరియా, జోర్డాన్, నార్త్ మెసిడోనియా, టర్క్‌మెనిస్తాన్ దేశాలు కూడా ఒక్కో రజత పతకంతో 60వ స్థానంలోనే కొనసాగుతున్నాయి.

క్రైమ్ మరిన్ని...