Advertisement
Advertisement
Abn logo
Advertisement

Tokyo Olympics: మరో 13 మంది క్రీడాకారులకు కరోనా

టోక్యో (జపాన్): జపాన్ దేశంలోని టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో సోమవారం మరో 16 మంది క్రీడాకారులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు విదేశీ అథ్లెట్లు ఉన్నారని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన అథ్లెట్లను క్రీడా విలేజ్ నుంచి బయటకు పంపంచి క్వారంటైన్ చేశారు. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 148కి పెరిగింది. 13 ఆటలకు సంబంధించిన 8మంది క్రీడాధికారులు కరోనా బారిన పడ్డారు. టోక్యో ఒలింపిక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ అథ్లెట్లుకు కరోనా సోకింది. డచ్ రోవర్ ఫిన్ ఫ్లోరిజ్న్ కు కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. ఒకవైపు టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు సాగుతుండగా, మరోవైపు క్రీడాగ్రామంలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. 


Advertisement
Advertisement