Abn logo
Jul 31 2021 @ 10:17AM

Tokyo Olympics: క్రీడాగ్రామంలో మరో 21 మందికి కరోనా

టోక్యో (జపాన్): జపాన్ దేశంలో టోక్యో నగరంలో క్రీడాగ్రామంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల నియంత్రణకు ఒలింపిక్స్ నిర్వాహకులు ఎన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా, శనివారం కొత్తగా 21 కరోనా కేసులు వెలుగుచూశాయి. శనివారం కరోనా సోకిన వారిలో క్రీడా సహాయకులున్నారు. అథ్లెట్లు ఎవరికీ కరోనా సోకలేదని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్పారు. జులై 1వతేదీ నుంచి ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 241కి పెరిగింది. శనివారం కరోనా సోకిన వారిలో 14 మంది కాంట్రాక్టర్లు, ఏడుగురు క్రీడా సంబంధ అధికారులున్నారని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పలు విదేశాల నుంచి 40,558 మంది జపాన్ రావడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.