Olympics: టోక్యోలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-08-07T12:47:47+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేపుతోంది.టోక్యో నగరంలో ఒక్క శుక్రవారం రోజే 4,515 కరోనా పాజిటివ్...

Olympics: టోక్యోలో కరోనా కలకలం

ఒక్కరోజే 4,515 కేసుల నమోదు

టోక్యో (జపాన్): టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేపుతోంది.టోక్యో నగరంలో ఒక్క శుక్రవారం రోజే 4,515 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ తెలిపింది. గురువారం టోక్యో నగరంలో 5,042 కరోనా కేసులు నమోదైనాయి. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న 29 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన అథ్లెట్లు, క్రీడా సహాయ సిబ్బందిని క్రీడా గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చి క్వారంటైన్ చేశారు. జపాన్ దేశంలో డెల్టా వేరియంట్ వైరస్ ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులుంటేనే ప్రయాణించాలని లేకుంటే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని జపాన్ సర్కారు సూచించింది.కరోనా కట్టడి కోసం జపాన్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. రాత్రి 8 గంటలకే ఆఫీసులను మూసివేసి, ఉద్యోగులు నేరుగా ఇళ్లకు వెళ్లాలని జపాన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. 


Updated Date - 2021-08-07T12:47:47+05:30 IST