Advertisement

టాలీవుడ్ డైరెక్టర్ కే యస్ నాగేశ్వరరావు కన్నుమూత..

దశాబ్దకాలానికి పైగా తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న కేఎస్ నాగేశ్వరరావు ఆకస్మికంగా మృతి చెందారు. రియల్ స్టార్ శ్రీహరిని ‘పోలీస్’ మూవీతో హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత ‘సాంబయ్య’, ‘శ్రీశైలం’ ‘దేవా’ లాంటి సినిమాలు కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఆతర్వాత శ్రీశైలం, లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో  ‘వైజయంతి’ చిత్రాలను రూపొందించి మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. రీసెంట్ గా ‘బిచ్చగడా మజాకా’ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగేశ్వరరావు గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంభందించిన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న (నవంబర్ 26) ఊరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. మార్గ మధ్యంలో ఫిట్స్ రావడంతో సీరియస్ అయిందట. కోదాడ వద్దకు రాగానే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రముఖ దర్శకుడు, నటుడు వీర శంకర్ తెలియజేశారు. ఇక ఈ ఉదయం నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో వారి అత్తగారి ఇంటి వద్ద అంతిమ సంస్కారం జరగనుందని కుటుంబ సబ్యులు తెలిపారు. కాగా, కేఎస్ నాగేశ్వరరావు మృతిపట్ల ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు, స్నేహితులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 

Advertisement