Abn logo
May 31 2020 @ 11:18AM

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాఠాలు వింటున్న తేజ

‘చిత్రం’ సినిమాతో మొదలెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ వరకు దర్శకుడు తేజ సాగించిన ప్రయాణం అందరికీ తెలిసిందే. కొత్త వాళ్లతో అద్భుతాలు చేయడంలో దిట్టగా ఆయనకు పేరుంది. నిత్య విద్యార్థిగా ఆయన చూపించే శ్రద్ధే దానికి కారణమంటుంటారు. ఇదిలా ఉంటే తేజ ప్రస్తుతం ఓ కొత్త కోర్సు నేర్చుకుంటున్నారు. ఆన్ లైన్ విద్యార్థిగా లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంతకూ ఆయన నేర్చుకుంటున్న అంశమేంటో తెలుసా.. ‘శ్వాసకోశ సంబంధ వ్యాధులు - వాటి నివారణ.’ ఈ అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న క్లాసులను ఆన్‌లైన్‌లో వింటున్నారు. శ్వాసకోసపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలపై పాఠాలను వింటున్నారు. ఈ క్లాసులు అయిన తర్వాత వాలంటీర్‌గా పనిచేయడానికి తాను సిద్ధమని తేజ చెబుతున్నారు.  

Advertisement
Advertisement
Advertisement