Advertisement
Advertisement
Abn logo
Advertisement

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. మరో సంచలనం

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణలో.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో డ్రగ్ కింగ్‌పింగ్‌గా ఉన్న కెల్విన్.. ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారారు. ఇతనే కీలక నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. బాలీవుడ్ కేసులో కూడా కెల్విన్‌కు లింకులు ఉన్నట్లు తేలింది. అలాగే టాలీవుడ్ డ్రగ్ కేసులో కెల్విన్ సూత్రధారి, పాత్రధారిగా ఉన్నారని అధికారులు గుర్తించారు.  ఈయన్ను ఈడీ 12 సార్లు విచారించింది. గతంలో ఎక్సైజ్ పోలీసుల విచారణలో కెల్విన్ ఎలాంటి విషయాలూ చెప్పలేదు. కెల్విన్‌కు సంబంధించిన అకౌంట్లలోకి సినీ తారలు భారీగా డబ్బులు జమ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో సినీ తారల బ్యాంక్ అకౌంట్లను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


ఇప్పటికే కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. కెల్విన్‌తో పాటూ మరో ముగ్గురు విదేశీయులు ఈడీ అధికారులకు  అప్రూవర్‌గా మారి కీలక సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే 12మంది సినీ తారలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను 9గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. గురువారం సినీతార చార్మి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. 12 మంది సినీతారల విచారణ తర్వాత.. పూర్తి సమాచారం తెలియజేస్తామని ఈడీ అధికారులు చెబుతున్నారు.  2020లో ఈడీ.. డ్రగ్స్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement