Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 09:45AM

నేడు ఈడీ ముందుకు తరుణ్

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. సినీ ప్రముఖుల విచారణ క్లైమాక్స్‌కు చేరింది. బుధవారం ఈడీ ముందుకు నటుడు తరుణ్ హాజరు కానున్నారు. మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటి వరకు 11 మందిని విచారించిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను ఇవాళ ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? కెల్విన్‌తో సంబంధాలు ఉన్నాయా. అనే కోణంలో అధికారులు విచారించనున్నారు.


బ్యాంక్ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌పై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. ఎఫ్ లాంజ్ పబ్ వ్యవహారాలు, నవదీప్ పార్టీలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ విచారణకు హాజరైన తరుణ్.. విచారణలో భాగంగా తరుణ్ నుంచి అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్‌ నివేదిక ఇచ్చింది. దీంతో తరుణ్, పూరీ జగన్నాథ్‌లకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌ చీట్ ఇచ్చింది. ఎక్సైజ్ కేసు కాకుండా గతంలో తరుణ్ పబ్‌లలో డ్రగ్స్ దందా సాగిందంటూ అనేక ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement