Abn logo
Sep 22 2021 @ 11:32AM

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. నటుడు తరుణ్‌ను విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. సినీ ప్రముఖుల విచారణ క్లైమాక్స్‌కు చేరింది. బుధవారం ఈడీ ముందుకు నటుడు తరుణ్ హాజరయ్యారు. దీంతో ముగ్గురు ఈడీ అధికారుల బృందం తరుణ్‌ను విచారిస్తున్నారు. కెల్విన్‌తో సంబందాలు, బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లను అధికారులకు తరుణ్ అందజేశారు. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంశాల ఆధారంగా ఈడీ ప్రశ్నిస్తోంది. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై తరుణ్‌ను విచారిస్తున్నారు. 2017 జూలై 19న తరుణ్ నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్‌ నివేదిక ఇచ్చింది. విచారణ కొనసాగుతోంది.


కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేశారు. ఇప్పటి వరకు 11 మందిని విచారించిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను ఇవాళ ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? కెల్విన్‌తో సంబంధాలు ఉన్నాయా. అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...