మీరాచోప్రా కేసు.. ట్విటర్‌కు నోటీసులు: సైబర్ క్రైమ్ ఏసీపీ

ABN , First Publish Date - 2021-06-17T21:59:49+05:30 IST

టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా కేసులో ట్విటర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై

మీరాచోప్రా కేసు.. ట్విటర్‌కు నోటీసులు: సైబర్ క్రైమ్ ఏసీపీ

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా కేసులో ట్విటర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై మీరా చోప్రా గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా ట్విటర్‌కు నోటీసులు జారీ చేసినట్టు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. అసభ్యకర పదజాలంతో ట్విటర్‌లో మీరా చోప్రాపై కామెంట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. గతంలో కేసు నమోదు చేయగా ట్విటర్‌లో పెట్టిన పోస్టులు డిలీట్ చేశారని చెప్పారు. ఐటీ యాక్ట్ 67, 67ఏ కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. మీరా చోప్రాపై ట్విట్టర్‌లో పెట్టిన వారి వివరాలు ఇవ్వాలని మరోసారి ట్విటర్‌కు నోటీసులు ఇచ్చామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ అన్నారు. సమాధానం రాని పక్షంలో 84, 109 అబిట్మెంట్ యాక్ట్ ప్రకారం ట్విటర్‌పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-06-17T21:59:49+05:30 IST