గతేడాది తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న టాలీవుడ్లో సంక్రాంతి ఫుల్ జోష్ నింపింది. మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిమానులకు, తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాల సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని కోరుతున్నారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి -చిరంజీవి
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు -నాగార్జున
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరినీ దేవుడు చల్లగా చూడాలి -వెంకటేష్
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాధ్యతగా ఉండండి. క్షేమంగా ఉండండి -మహేష్
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు -ఎన్టీయార్
అందరికీ సంక్రాంతి/పొంగల్ శుభాకాంక్షలు -సమంత
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. `క్రాక్`కు మీరు అందిస్తున్న మద్దతు చాలా సంతోషం కలిగిస్తోంది. నా అభిమానులకు, నా సహ నటులకు, శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండి పండుగలను జరుపుకోండి -రవితేజ