టామ్‌ క్రూజ్‌ ఫైర్‌

ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ వృత్తిలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. ఇప్పుడు ఆయన ఇంగ్లాండ్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నిర్లక్ష్యం ఆయనకు ఏ మాత్రం నచ్చని విషయం. కరోనా జాగ్రత్తలను గురించి ముందే సిబ్బందికి వివరించారు...

టామ్‌ క్రూజ్‌ ఫైర్‌

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ వృత్తిలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. ఇప్పుడు ఆయన ఇంగ్లాండ్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నిర్లక్ష్యం ఆయనకు ఏ మాత్రం నచ్చని విషయం. కరోనా జాగ్రత్తలను గురించి ముందే సిబ్బందికి వివరించారు. అయినా సిబ్బందిలో ఓ ఇద్దరు సామాజిక దూరం పాటించకుండా దగ్గరగా నిల్చున్నారు. దాంతో టామ్‌కోపం నషాళానికి అంటింది. అంతే వారిద్దరిపై పెద్ద గొంతుతో తిట్లతో విరుచుకుపడ్డారు. ఆ వాయిస్‌ రికార్డ్‌ ఇప్పుడు నెట్‌లో వైరలవుతోంది.


‘‘మళ్లీ ఇంకోసారి మిమ్మల్ని ఇలా చూస్తే మీరు ఇక్కడ ఉండరు. ఇక్కడున్నవాళ్లలో ఎవరైనా సరే ఇలా చేస్తే అంతే సంగతులు. సినిమాలు తీయడానికి ఇంతమంది హాలీవుడ్‌కు వస్తున్నారంటే అది మన కోసం. దీని ద్వారా వేలాది ఉద్యోగాలను మనం సృష్టిస్తున్నాం. ఇండస్ట్రీ షట్‌డౌన్‌ అవ్వడం వల్ల వేలాది మంది తమ గూడు కోల్పోయారు. మనం ఈ సినిమా షూటింగ్‌ను ఆపాలనుకోవడం లేదనే విషయం అర్థం చేసుకోని సెట్స్‌లో మెలగండి.  నేను మరోసారి మిమ్మల్ని ఇలా చూస్తే మీరు ఇక్కడ ఉండరు’’ అని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు ఈ హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌.

Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST