రేపు JDS అభ్యర్థుల జాబితా
ABN , First Publish Date - 2021-11-21T16:59:57+05:30 IST
విధానపరిషత్‌కు పోటీ చేసే జేడీఎస్ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడా
బెంగళూరు: విధానపరిషత్‌కు పోటీ చేసే జేడీఎస్ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని స్థానాలలోనూ తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ప్రశ్నే లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం సగం స్థానాలు గెలుచుకోవాలన్నది తమ లక్ష్యమన్నారు.