టొమాటో మెరుపులు...

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

ముఖం అందంగా కనిపించాలంటే... టొమాటో మాస్కు తప్పనిసరి. టొమాటోలో విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌ సి కూడా ఉండడం వల్ల ముఖంపై మొటిమలు రావు...

టొమాటో మెరుపులు...

ముఖం అందంగా కనిపించాలంటే... టొమాటో మాస్కు తప్పనిసరి. టొమాటోలో విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్‌ సి కూడా ఉండడం వల్ల ముఖంపై మొటిమలు రావు. పదిహేను రోజులకు ఒకసారి టొమాటో మాస్కు వేసుకోవచ్చు. ముఖానికి టొమాటోతో స్క్రబ్బింగ్‌, క్లీనింగ్‌, ఫేస్‌ప్యాక్‌ ఎలా చేసుకోవచ్చంటే...


క్లీనింగ్‌ 

కావలసినవి: సెనగపిండి, శాండిల్‌ పౌడర్‌, టొమాటో ప్యూరీ, పెరుగు, చిటికెడు పసుపు. 

తయారీ: టొమాటో ప్యూరీ-ఒక టీస్పూన్‌, పెరుగు-ఒక టీస్పూన్‌, నిమ్మరసం-ఒక స్పూన్‌, పసుపు-కొద్దిగా తీసుకుని, ఒక కప్పులో వేసి పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని (చేతులకు కూడా ఈ మిశ్రమాన్ని రాసుకుంటే టాన్‌ పోతుంది) 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నేరుగా నీళ్లతో కడగకుండా ముఖంపై కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుని కాటన్‌తో తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది. 


స్క్రబ్బింగ్‌

కావలసినవి: బియ్యప్పిండి, టొమాటో ప్యూరీ, పచ్చిపాలు, చిటికెడు పసుపు.

తయారీ: ఒక స్పూను బియ్యప్పిండి, ఒక స్పూను టొమాటో ప్యూరీ, ఒక స్పూను పచ్చిపాలు, చిటికెడు పసుపు ఒక కప్పులో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద పూసి, మసాజ్‌ చేస్తున్నట్టుగా ఐదు నుంచి పది నిమిషాలు రాయాలి. తర్వాత వాటర్‌ స్ర్పేతో దూదిని ఉపయోగించి క్లీన్‌ చేయాలి.


ఫేస్‌ప్యాక్‌

కావలసినవి: టొమాటో ప్యూరీ రెండు స్పూన్లు, ఒక టీ స్పూను పెరుగు (జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పాలను వాడాలి), కొద్దిగా గంధం పొడి.

తయారీ: పై పదార్థాలన్నింటినీ ఒక కప్పులో వేసి పేస్టులా చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని, 20 నిమిషాలు ఉంచుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖంపై నీళ్లు చల్లి దూదితో శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా, నిగనిగలాడుతూ కనిపిస్తుంది.  


Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST