లాభాల బాటపట్టిన టమోటా రైతులు

ABN , First Publish Date - 2021-10-15T06:20:51+05:30 IST

కరువు రైతుకు టమోటా సిరులు కురిపిస్తోంది. మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో టమోటా సాగుచేసినప్పటికకీ ఇప్పుడిప్పుడే పంటకోతలు ప్రారంభిస్తున్న రైతులు మాత్రమే లాభాలు గడిస్తున్నారు.

లాభాల బాటపట్టిన టమోటా  రైతులు
గ్రేడింగ్‌ చేస్తున్న దృశ్యం



 తాడిమర్రి, అక్టోబరు 14: కరువు రైతుకు టమోటా సిరులు కురిపిస్తోంది. మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో టమోటా సాగుచేసినప్పటికకీ ఇప్పుడిప్పుడే పంటకోతలు ప్రారంభిస్తున్న రైతులు మాత్రమే  లాభాలు గడిస్తున్నారు. రెండు నెలలుగా టమో టా పంట కోతలు కోస్తున్నా.. ధరలేక రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పదిరోజుల క్రితం వారంపాటు వర్షాలు కురవడంతో చాలామం ది రైతుల పంట దెబ్బతింది. దీంతో ఇప్పుడు పంట దిగుబడి వస్తున్న రైతు లు లాభాలు పొందుతున్నారు. గతం లో రూ.3 నుంచి రూ.5 వరకు ధర పలికిన టమోటా ఇప్పుడు రూ.22.30 వరకు ధర పలుకుతోంది. దీంతో 30 కేజీల బాక్స్‌ రూ.600 నుంచి రూ.800 వరకు అమ్ముడవుతోంది.


రూ.7లక్షలదాకా లాభం వచ్చేలా ఉంది : పరమేశ్వరనాయుడు, రైతు, దాడితోట

నాకున్న మూడెకరాల్లో టమోటా సాగుచేశా. దిగుబడి ఆశాజనకంగా ఉండడం, ధర బాగుండడంతో ఇప్పటికే రూ.6లక్షల వరకు లాభం పొందా. మరో రూ.3లక్షలదాకా లాభం వచ్చేలా ఉంది. పెట్టుబడి పోను రూ.7 లక్షల దాకా లాభం వస్తుంది. ఇప్పటికి 700 బాక్సుల దిగుబడి వచ్చింది. మరో 700 బాక్సులు రావొచ్చు. తద్వారా మరో రూ.5 లక్షలదాకా లాభం గడించే అవకాశం ఉంది.


ఇప్పుడిప్పుడే దిగుబడి మొదలైంది : శివారెడ్డి, రైతు, దాడితోట

దిగుబడి ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే మంచి లాభాలు వస్తాయి. తుఫాను ప్రభావం లేకపోతే నాణ్యమైన దిగుబడి కూడా వస్తుంది. తద్వారా ఎకరానికి రూ.2లక్షలు లాభం పొందవచ్చు.


Updated Date - 2021-10-15T06:20:51+05:30 IST