టమాట ధర ఢమాల్‌

ABN , First Publish Date - 2021-01-14T05:40:55+05:30 IST

టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

టమాట ధర ఢమాల్‌
ఖేడ్‌లో విక్రయానికి సిద్ధంగా ఉన్న టమాట

కిలో రూ. 30 నుంచి రూ.5కి 

ఆందోళనలో రైతులు


నారాయణఖేడ్‌, జనవరి 13: టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి వరకు టమాట ధర ఆశాజనకంగా ఉండడంతో, రైతులు సాగుకు ఆసక్తి చూపారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంత రైతులు పండించిన పంట విక్రయానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ధర పడి పోయింది. ఇటీవలి వరకు నాణ్యతను బట్టి కిలో టమాటను రూ.20 నుంచి 30 వరకు విక్రయించారు. ప్రస్తుతం మార్కెట్లో హోల్‌సేల్‌గా 30 కిలోల బాక్సు ధర నాణ్యతను బట్టి రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. రీటేల్‌గా కిలో టమాటను నాణ్యతను బట్టి రూ.5 నుంచి 10 చొప్పున విక్రయిస్తున్నారు. ధర పడి పోవడంతో టమాటను పొలం నుంచి తీసి మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ సంవత్సరం కొద్ది నెలల పాటు టమాట ధర నిలకడగా ఉన్నప్పటికీ, మూడు రోజుల క్రితం అమాంతం  పడిపోయినదని రైతులు  భోరుమన్నారు. 

Updated Date - 2021-01-14T05:40:55+05:30 IST