వామ్మో.. టమోత

ABN , First Publish Date - 2021-12-07T06:56:58+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమోట పంట దెబ్బతినడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదివరకే...

వామ్మో.. టమోత

న్యూఢిల్లీ, డిసెంబరు 6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమోట పంట దెబ్బతినడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదివరకే కిలో ధర సెంచరీ దాటగా, తాజాగా గరిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం అండమాన్‌, నికోబర్‌ దీవుల్లో మాయాబందర్‌లో కిలో టమోట ధర రిటైల్‌గా 140 రూపాయలు పలికింది.


పోర్టుబ్లెయిర్‌లో కిలో రూ.127కు అమ్మారు. కేరళలో గరిష్ఠంగా తిరువనంతపురంలో రూ.125, పలక్కాడ్‌, వయనాడ్‌లో రూ.105 ధర పలికింది. కర్ణాటకలో అత్యధికంగా మంగళూరు, తుముకూరులో కిలో ధర రూ.100కు చేరింది. తమిళనాడులోనూ కిలో ధర సెంచరీ దాటింది. రామనాథపురంలో రూ.102, తిరునెల్వేలిలో రూ.92, చెన్నైలో రూ.83 చొప్పున అమ్మారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళంలో కిలో రూ.80, విశాఖపట్నంలో కిలో రూ.77 ధర పలికింది. తెలంగాణలో వరంగల్‌లో కిలో రూ.85కు విక్రయించారు. 

Updated Date - 2021-12-07T06:56:58+05:30 IST