మళ్లీ రూ.100 దాటిన టమోటా

ABN , First Publish Date - 2021-12-06T17:47:35+05:30 IST

చెన్నైలో మళ్లీ టమోటా కిలో రూ.100 దాటింది. ఆంధ్ర, కర్ణాటక, కృష్ణగిరి ప్రాంతాల నుంచి దిగుమ తులు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. శనివారం 40 నుంచి

మళ్లీ రూ.100 దాటిన టమోటా

చెన్నై/పెరంబూర్: చెన్నైలో మళ్లీ టమోటా కిలో రూ.100 దాటింది. ఆంధ్ర, కర్ణాటక, కృష్ణగిరి ప్రాంతాల నుంచి దిగుమ తులు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. శనివారం 40 నుంచి 50 లారీల్లో మాత్రమే టమోటాలు వచ్చాయి. దీంతో కోయంబేడు మార్కెట్లో మొదటి రకం టమోటా కిలో రూ.90, రెండవ రకం రూ.80కి విక్రయమవుతోంది. ఇక, చిల్లర వ్యాపారులు మొదటి రకం రూ.100 నుంచి రూ.110, రెండవ రకం రూ.90కి విక్రయిస్తున్నారు.

Updated Date - 2021-12-06T17:47:35+05:30 IST