Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

రేపు కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌వోల ధర్నా 

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 7 : శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్య లు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తా మని వీఆర్వోల అసోసియే షన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు హెచ్చరించారు. ఈనెల 9న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని మంగళవారం డీఆర్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమిషనర్‌ క్షమాపణ చెప్పారని, మంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఏలూరు డివిజన్‌ అధ్యక్షుడు సాయల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు రవికుమార్‌, అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement