కొనసాగుతున్న టోనీ కస్టడీ విచారణ.కొనసాగుతున్న టోనీ కస్టడీ విచారణ.. ప్రశ్నావళిని సిద్ధం చేసిన పోలీసులు. ప్రశ్నావళిని సిద్ధం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-01-29T20:11:06+05:30 IST

ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. పంజాగుట్ట పీఎస్‌లో ప్రత్యేక గదిలో భారీ భద్రత నడుమ విచారణ కొనసాగుతోంది.

కొనసాగుతున్న టోనీ కస్టడీ విచారణ.కొనసాగుతున్న టోనీ కస్టడీ విచారణ.. ప్రశ్నావళిని సిద్ధం చేసిన పోలీసులు. ప్రశ్నావళిని సిద్ధం చేసిన పోలీసులు

హైదరాబాద్ : ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. పంజాగుట్ట పీఎస్‌లో ప్రత్యేక గదిలో భారీ భద్రత నడుమ విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసుకొని ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. టోనీని ప్రశ్నించేందుకు పోలీసులు ట్రాన్సిలేటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అరెస్ట్ అయిన తొమ్మిది మంది వినియోగదారులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంకా ఎంతమందితో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. టోనీ ఏజంట్స్ ఇమ్రాన్, నూర్‌లతో పరిచయాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా ఎంతమంది ఏజంట్స్ ఉన్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ‘టోనీ కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఎవరివి? ఆ వ్యక్తులు ఎవరు? 2019 నుంచి ఇప్పటి వరకూ ఎంతమందికి డ్రగ్స్ సరఫరా చేశారు? నైజీరియన్ స్టార్ బాయ్ నుంచి ఎంత డ్రగ్స్ ఇండియాకు తరలించారు? దేశ వ్యాప్తంగా ఎంత మంది ఏజంట్స్ ఉన్నారు? ఎన్ని మెట్రో పాలిటన్ సిటీస్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు?’ అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు.


Updated Date - 2022-01-29T20:11:06+05:30 IST