ఆటోమెటిక్‌గా ఓపెన్‌ అవుతున్నాయి.. ఎందుకని?

ABN , First Publish Date - 2020-03-21T06:23:19+05:30 IST

కొన్ని అప్లికేషన్లు మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వెంటనే కంప్యూటర్‌ ఆన్‌ చేసిన ప్రతీసారీ వాటంతట అవే ప్రారంభించబడే విధంగా విండోస్‌ స్టార్టప్‌లో ఎంట్రీలను సృష్టించుకుంటాయి. మన ఇష్టంతో ప్రమేయం లేకుండా, అవి తమకు తాము అతి

ఆటోమెటిక్‌గా ఓపెన్‌ అవుతున్నాయి.. ఎందుకని?

నేను ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేసిన వెంటనే టొరెంట్‌ ఐఎంఓ అప్లికేషన్లు  ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అవుతున్నాయి. అలా కాకూడదంటే ఏం చేయాలి? 

-  సాయికృష్ణ సిహెచ్‌


కొన్ని అప్లికేషన్లు మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వెంటనే కంప్యూటర్‌ ఆన్‌ చేసిన ప్రతీసారీ  వాటంతట అవే ప్రారంభించబడే విధంగా విండోస్‌ స్టార్టప్‌లో ఎంట్రీలను  సృష్టించుకుంటాయి. మన ఇష్టంతో ప్రమేయం లేకుండా, అవి తమకు తాము అతి ముఖ్యమైనవి అని భావించడం వల్ల ఏర్పడే ఇబ్బంది ఇది.  వీటిని డిజేబుల్‌ చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మీరు చెప్పిన రెండు యాప్స్‌లో సెట్టింగ్స్‌లోకి వెళితే  ఆటోమేటిక్‌గా స్టార్ట్‌ అవడాన్ని డిజేబుల్‌ చేసే ఆప్షన్‌ ఉంటుంది.  దాన్ని ఎంపిక చేసుకోండి. కొన్ని ఇతర అప్లికేషన్ల విషయంలో ఇలాంటి సెట్టింగ్‌ ఏదీ  లేనట్లయితే, మీ కంప్యూటర్లో టాస్క్‌ మేనేజర్‌ ఓపెన్‌ చేసి, అందులో స్టార్టప్‌ అనే విభాగంలోకి వెళ్లి ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అవుతున్న ప్రోగ్రామ్‌ని గుర్తించి దాన్ని డిజేబుల్‌ చేసుకుంటే సరిపోతుంది.

Updated Date - 2020-03-21T06:23:19+05:30 IST