కుండపోత వాన

ABN , First Publish Date - 2021-07-23T06:21:42+05:30 IST

మూడు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురు వారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురి యడంతో జిల్లా వ్యాప్తంగా 70.8మి.మీల సగటు వర్షపాతం నమో దైంది. ఈ స్థాయిలో వర్షం కురియడం ఇదే మొదటి సారిగా చెబుతున్నారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడం తో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల కనిపిస్తున్నాయి.

కుండపోత వాన

జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు

70.8 మి.మీల సగటు వర్షపాతం నమోదు

అత్యధికంగా బోథ్‌ మండలంలో 211.4 మి.మీల వర్షం

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు, పంటపొలాలు

అతలాకుతలమైన జనజీవనం.. నిలిచిన రాకపోకలు

మరో 48 గంటల పాటు జిల్లాకు వర్ష సూచన హెచ్చరిక

ఆదిలాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురు వారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురి యడంతో జిల్లా వ్యాప్తంగా 70.8మి.మీల సగటు వర్షపాతం నమో దైంది. ఈ స్థాయిలో వర్షం కురియడం ఇదే మొదటి సారిగా చెబుతున్నారు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడం తో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో అత్యధికంగా నేరడి గొండ మండలంలో 986.2మి.మీల వర్షం పడింది. బేల మండలంలో సాధారణ వర్ష పాతం నమోదు కాగా బీంపూర్‌, ఆది లాబాద్‌ రూరల్‌, మావల, గాది గూడ మండలాల్లో లోటు వర్షపాతం కురిసింది.   బోథ్‌, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ మండలాల్లో భారీ వర్షాలు కురియడంతో పంట పొలా లు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా నార్నూర్‌, గాదిగూడ, ఉట్నూర్‌, నేరడిగొండ, సిరికొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌ మండలాల్లోని 34 గ్రామాలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వందలాది ఎకరాల్లో పంటలు కోతకు గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మరో 48 గంటల పాటు జిల్లాకు వర్ష సూచన ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

అంతా అతలాకుతలం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతల మవుతోంది. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాం తాలు జలమ యమయ్యాయి. ప్రధానంగా క్రాంతినగర్‌, జీఎస్టేట్‌ కాలనీ, ఖానా పూర్‌, తాటిగూడ, వాల్మీకినగర్‌, రాజీవ్‌ నగర్‌, తిర్పెల్లి, బొక్క లగూడ కాలనీల్లోని పలు ఇండ్లలో వర్షపు నీరు చేరింది. అలాగే బజార్‌హత్నూర్‌ మండలం బోస్రా గ్రామానికి చెందిన దిగం బర్‌ అనే రైతు ఇండ్లు కూలి పోయింది. పంట పొలాల్లోకి వరద నీరుచేరి పత్తి, సోయా, కంది  పంటలు నీట ముని గాయి. వాగులు, వంకలు పొంగిపారడంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. నేరడిగొండ మండలం వాగ్ధారి, వెంకటాపూర్‌ గ్రామాల్లోకి వరద నీరుచేరడంతో కడెంనది శాంతించాలని మేకపోతును బలిచ్చారు. పలు గ్రామాల రోడ్లపై లోలెవల్‌ కల్వర్టులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, ఆదిలాబాద్‌ రహదారిపై వాంకిడివాగు, ఉధృతంగా ప్రవహించడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు..

జిల్లాలో భారీ వర్షం కురియడంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధా నంగా కడెంనది భారీ వరద నీటితో ప్రవహించడంతో పొచ్చెర, కుంటాల జల పాతాలు పరవళ్లు పెడుతున్నాయి. అలాగే ముఖ్ర(కె) వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపో యాయి. కుప్టి, బంగారిగూడ వాగులు వరద నీటితో పరవళ్లు పెడుతున్నాయి. జిల్లా సరి హద్దుల్లో ఉన్న పెన్‌గంగా నదికి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా రావడంతోనీటి ప్రవాహం పెరుగుతోంది. నదుల పరివాహక ప్రాం తాల్లో ఉన్న పంట పొలాలు కోతకు గురై ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఇప్పు డిప్పుడే ఆశా జనకంగా కనిపిస్తున్నా పంటలను చూసి ఆనంద పడుతున్న సమయంలోనే భారీ వర్షాల కారణంగా వరదకు గురికావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బోథ్‌లో రికార్డు వర్షం..

ఈ సీజన్‌లో బోథ్‌ మండలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8గంటల వరకు 211.4 మి.మీల వర్షపాతం కురిసింది. అలాగే నేరడిగొండ మండలంలో 182.6, బజార్‌ హత్నూర్‌లో 148.2, ఇచ్చోడలో 78, ఉట్నూర్‌లో 63.4 వర్షపాతం నమో దైంది. ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లోనే అధిక వర్షపాతం నమోదు కావడంతో పలు మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. బోథ్‌ మండలం ధన్నూ ర్‌ గ్రామంలోకి వరద నీరు చేరి బీభత్సాన్ని సృష్టించింది. భీంపూర్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, మావల, సిరికొండ, గాదిగూడ మండ లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే సాత్నాల, మత్తడివాగు, చిక్‌మాన్‌ ప్రాజెక్టులు నిండు కుండల కనిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 487 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.


Updated Date - 2021-07-23T06:21:42+05:30 IST