దంచికొట్టిన వాన

ABN , First Publish Date - 2022-09-30T05:11:30+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి.

దంచికొట్టిన వాన
మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలో ప్రవహిస్తున్న వరద

- పొంగిన వాగులు వంకలు

- రాకపోకలకు ఇబ్బంది పడిన ప్రయాణికులు 

-  పాలమూరులో కొట్టుకుపోయిన కారు.. 

-  పలు ఇళ్లలోకి చేరిన నీరు 

-  లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

-  ప్రజలను అప్రమత్తం చేయాలన్న  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. దీంతో చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యా యి. పార్కింగ్‌ చేసిన కారు వరద ఉధృతి కి కొట్టుకుపోయింది.  జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం గుడ్డెందొడ్డి గ్రామంలో పిడుగుపడి ఎద్దు మృతి చెందింది.  మహబూబ్‌నగర్‌లో 9.4,  వడ్డేపల్లి 9.3, గద్వాలలో 6.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడూరు   మండలంలోచెరువు, కుంటలు అలుగుపారాయి.

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల/ హన్వాడ/ అచ్చంపేట/ తా డూరు/ఇటిక్యాల/గద్వాల/ధరూరు/నారాయణపేట, సెప్టెం బరు 29: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం వర్షం దంచి కొట్టింది. భారీవర్షానికి వాగులు, చెక్‌డ్యాంలు పొంగి పొర్లా యి. పాలమూరులో వర్షం బీభత్సం సృష్ఠించింది.. రెండు గంటలపాటు కుండపోతలా కురిసింది. పట్టణంలో 9.4 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షానికి పట్టణం జలదిగ్బంధమైంది.. తెలంగాణచౌరస్తా, శ్రీకృష్ణటాకీస్‌, న్యూ టౌన్‌, బస్టాండ్‌, జిల్లా పరిషత్‌ మైదానంలోకి పాంతాలలో వర్షపు నీరు భారీగా చేరింది. లక్ష్మీనగర్‌కాలనీలో ఇళ్లలోకి నీరుచేరింది. మినీట్యాంక్‌ బండ్‌ దిగువన ఉన్న బీకే రెడ్డి కాలనీ, రామయ్యబౌళి, మధురానగర్‌కాలనీ, శివశక్తినగర్‌ల ను వరద ముంచెత్తింది. ట్యాంక్‌బండ్‌ రెండువైపుల అలు గుల నుంచి నీరు నేరుగా కాలనీల్లోకి నీరు నుంచి ప్రవ హించడంతో జనం అల్లాడిపోయారు. బీకేరెడ్డి కాలనీలో ఇంటి ముందు పార్క్‌ చేసిన కారు వరద ప్రవాహనానికి కొట్టుకు పోయి కొద్దిదూరంలోని విద్యుత్‌స్తంభానికి ఆనుకు ని ఆగిపోయింది. తరువాత క్రేన్‌ సహాయంతో కారును బయటకు లాగారు. ద్విచక్రవాహనాలు వరదలో మునిగి పోయాయి. మురుగునీరు వరదలా రావడంతో ఆయా ప్రాంతాలలో తీవ్ర దుర్ఘంధం నెలకొంది. జడ్చర్ల, బాలా నగర్‌, హ న్వాడ, భూత్పూర్‌ మండలాల్లోనూ భారీ  వర్షం కురిసింది. 

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు  

పాలమూరు లోతట్టు ప్రాంతాల్లో అడిషినల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, కౌన్సిలర్లు ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, రశ్మితప్రశాంత్‌లు పర్యటించారు. నీటి ప్రవాహానానికి అడ్డంగా చెత్తచెదారం పేరుకుపోతే తొలగించాలని ఆదేశించారు.గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదా బాద్‌లో ఉన్న మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు..  ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాని ఆదేశించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని నల్ల మల కొండల్లో వెయ్యి అడుగుల ఎత్తులో కొలువైన ఉమా మహేశ్వర సన్నిధిలో కొండలపై నుంచి జాలువారు తున్న జలపాతం  భక్తులను పర్యాటకులను కనువిందు చేస్తున్న ది. గురువారం ఉదయం భారీవర్షం కురియడంతో పాప నాశిని, నాగ దేవతలు కొలువైన సమీపంలో కొండపై నుం చి వస్తున్న జల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. తాడూరు మండలంలో గురువారం ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదై నట్లు అధికారులు తెలిపారు. మండలంలోని చెరువులు, కుంటలు అలుగులు పార డంతోపాటు దుందుభీ నది పరుగులు తీస్తోంది. ప్రధానం గా పత్తి పంటకు వర్షాలు నష్టం చేస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

నారాయణపేట జిల్లాలో అత్యధికంగా మరికల్‌లో 25.3 మిల్లీమీటర్ల, అతిస్వల్పంగా ఊట్కూర్‌లో 3.0 మీ.మీ. వర్ష పాతం నమోదైంది. నారాయణపేటలో 22.4 మిల్లీమీటర్ల, మాగనూర్‌లో 10.2 మీ.మీ, కృష్ణాలో 4.8 మీ.మీ, మక్తల్‌లో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో  రోడ్లన్నీ జలమ యం అయ్యాయి. గద్వాల పట్టణంలో దాదాపు 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఒంటెలపేట, కుంటవీధి కాలనీలలో రోడ్లు జలమయం అయ్యాయి.  ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ధరూర్‌ మండలంలోని గుడ్డెందొడ్డిలో పిడుగు పాటుకు ఎద్దు మృతి చెందింది.  ఇటిక్యాల మండలంలోని సాతర్ల వాగుకు వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డేపల్లి మండలంలో అత్యధికంగా 93.4 మిల్లీమీటర్ల వర్షం, గద్వాలలో 60 మిల్లీమీటర్లు, రాజోలీలో 50.8 ధరూర్‌లో 45.2 మల్దకల్‌లో 46.5 అయిజలో 30.4 ఇటిక్యాలలో 29.2 మానవపాడులో 24.5, ఉండవెల్లిలో 16.9 గట్టులో 17.6, కేటీదొడ్డిలో 14.3 మిల్లీ మీటర్ల వర్షం కురవగా అలంపూర్‌లో అతిస్వల్పంగా వర్షం కురిసింది.   

 







Updated Date - 2022-09-30T05:11:30+05:30 IST