వీడియో: వెనక్కు వెళ్తున్న జలపాతాన్ని ఎక్కడైనా చూశారా?

ABN , First Publish Date - 2020-08-15T00:38:48+05:30 IST

గురుత్వాకర్షణ శక్తి గురించి అందరూ చదువుకునే ఉంటారు. భూమి మీద జీవులు, నిర్జీవ వస్తువులు నిలబడి ఉన్నాయన్నా.. కొండ పైనుంచి నీళ్లు కిందకు పడుతున్నాయన్నా దాని

వీడియో: వెనక్కు వెళ్తున్న జలపాతాన్ని ఎక్కడైనా చూశారా?

సిడ్నీ: గురుత్వాకర్షణ శక్తి గురించి అందరూ చదువుకునే ఉంటారు. భూమి మీద జీవులు, నిర్జీవ వస్తువులు నిలబడి ఉన్నాయన్నా.. కొండ పైనుంచి నీళ్లు కిందకు పడుతున్నాయన్నా దానికి కారణం గురుత్వాకర్షణే. కాని ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆస్ట్రేలియాలోని ఓ జలపాతం కిందకు పడకుండా వెనక్కు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జలపాతం అంటే నీళ్లు కొండ పైనుంచి కిందకు వెళ్తాయని తెలుసు. కాని ఈ జలపాతం విషయానికి వస్తే నీళ్లు కిందకు రాకుండా వెనక్కు వెళ్లాయి. సిడ్నీ దగ్గరలోని రాయల్ నేషనల్ పార్క్‌ వద్ద ఈ ఆశ్చర్యకరమైన సంఘటన నెలకొంది. అయితే ఈ జలపాతం వెనక్కు వెళ్లడానికి కుండపోత వాన, ఘోరమైన వాతావరణమే కారణమని చెబుతున్నారు. సముద్రం నుంచి గంటకు 74 కి.మీ వేగంతో గాలి వీయడం వల్లే ఈ జలపాతం వెనక్కు వెళ్లినట్టు వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోను పైన చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఒక జలపాతం వెనక్కు వెళ్లడం తమ జీవితంలోనే చూడలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Video Credits: BBC News

Updated Date - 2020-08-15T00:38:48+05:30 IST