టోస్టెడ్‌ రావియోలి

ABN , First Publish Date - 2020-12-26T20:32:56+05:30 IST

రావియోలి(ఒక రకం పాస్తా) - పావుకేజీ, కోడిగుడ్లు - రెండు, పాలు - ఒకటిన్నర కప్పు, బ్రెడ్‌ ముక్కలు - రెండు కప్పులు, కొత్తిమీర - ఒకకట్ట, రోజ్‌మేరీ - కొద్దిగా, ఉప్పు

టోస్టెడ్‌ రావియోలి

కావలసినవి: రావియోలి(ఒక రకం పాస్తా) - పావుకేజీ, కోడిగుడ్లు - రెండు, పాలు - ఒకటిన్నర కప్పు, బ్రెడ్‌ ముక్కలు - రెండు కప్పులు, కొత్తిమీర - ఒకకట్ట, రోజ్‌మేరీ - కొద్దిగా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, పర్మేసన్‌ చీజ్‌ - అర కప్పు.


తయారీ విధానం: బేకింగ్‌ షీట్‌లో రావియోలి పెట్టుకుని అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒకపాత్రలో కోడిగుడ్లు పగలగొట్టి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో బ్రెడ్‌ ముక్కలు, కొత్తిమీర, రోజ్‌మేరీ, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. కోడిగుడ్డు మిక్చర్‌లో రావియోలి ముక్కలను డిప్‌ చేసుకుంటూ, బ్రెడ్‌ ముక్కలను కోట్‌లా అద్దుకోవాలి. తిరిగి బేకింగ్‌ షీట్‌లో పెట్టి మరో పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక రావియోలను వేసి వేగించాలి. సన్నగా తరిగిన పర్మేసన్‌ చీజ్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-12-26T20:32:56+05:30 IST