ఉత్తరాఖండ్‌లో 1000 దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-03T05:21:34+05:30 IST

ఉత్తరాఖండ్‌లో కొత్తగా మరో 85 మందికి కరోనా సోకినట్టు గుర్తించడంతో... రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య ..

ఉత్తరాఖండ్‌లో 1000 దాటిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కొత్తగా మరో 85 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 1000 దాటినట్టు ఇవాళ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటిన్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,043కి చేరింది. ఇప్పటి వరకు ఇక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే వారంతా వేరే కారణాలతో మరణించారనీ.. కరోనా వల్ల కాదని అధికారులు చెబుతున్నారు. మంగళవారం  ఒక్కరోజే డెహ్రాడూన్ నుంచి 37 కేసులు, నైనిటాల్ నుంచి 22, తెహ్రీ నుంచి 14 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. చమోలీలో ఆరుగురు, పౌరీలో ముగ్గురు, రుద్రప్రయాగలో ఇద్దరు, హరిద్వార్‌లో ఒక్కరు చొప్పున కొత్తగా కొవిడ్-19 వ్యాధికి గురయ్యారు. వీళ్లలో ఎక్కువ మంది ముంబై, ఢిల్లీ, పుణే పట్టణాల నుంచి తిరిగి వచ్చిన వారే ఉండడం గమనార్హం. 

Updated Date - 2020-06-03T05:21:34+05:30 IST