Abn logo
Sep 19 2021 @ 11:26AM

బార్‌లో నగ్నంగా తిరుగుతూ కలకలం రేపిన మందుబాబు.. నెట్టింట ఫొటో పెట్టడంతో పేలుతున్న సైటైర్లు..!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ బాగానే ఉన్న ఓ వ్యక్తి.. అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తించాడు. ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసి, పక్కన పడేశాడు. బార్‌లో నగ్నంగా తిరిగుతూ అందరినీ అయోమయానికి గురిచేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఈ నెల 14న స్థానికంగా ఉన్న ఓ బార్‌లోకి వెళ్లాడు. మద్యం సేవించే వారి పక్కన కొద్దిసేపటి వరకూ కూర్చుని.. అందరినీ గమనించాడు. అనంతరం ఒక్కసారిగాపైకి లేచి.. విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. తన ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసి, పక్కన పడేశాడు. నగ్నంగా బార్‌లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. కౌంటర్ దగ్గరకు వెళ్లి, అక్కడి సిబ్బందితో కొద్ది సమయం వరకు సంభాషించాడు.


ఆ తర్వాత వెనక్కి వచ్చి.. మళ్లీ తన దుస్తులను ధరించాడు. కాగా.. బార్‌లో అప్పటి వరకు కూర్చుని అందరినీ గమనించిన వ్యక్తి.. అనూహ్యంగా బట్టలు విప్పేయడంతో అందులోని కస్టమర్లూ, సిబ్బంది ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడో అర్థంకాక తలలు పట్టుకున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ‘ఏముంది.. పీకలదాకా తాగి.. ఎవరితోనే బెట్ కట్టి ఉంటాడు.. అందుకే అలా చేశాడేమో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఫొటోను ఇప్పటి వరకు 10 వేల మంది వీక్షించగా అందులో దాదాపు 700 మంది కామెంట్ చేశారు. 



ప్రత్యేకంమరిన్ని...