Abn logo
Sep 27 2021 @ 00:00AM

కేతవరంలో పర్యాటక దినోత్సవం

విద్యార్థినికి జ్ఞాపిక అందిస్తున్న జేసీ (సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు

కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 27: ఓర్వకల్లు మండలం కేతవరంలో సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవర నిర్వహించారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ (సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేతవరం గుహలలో ఆదిమానవులు గీసిన రాతి చిత్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా రోడ్డు మార్గాన్ని శుభ్రం చేయించాలని, చిత్రాల వద్ద వాచ్‌వార్డ్‌ను నియమించాలని సూచించారు. ఏపీ టూరిజం రెస్టారెంట్‌ను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్‌ కె.లక్ష్మీదేవి, సెట్కూర్‌ సీఈవో నాగరాజు నాయుడు, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కేతవరం గ్రామ సర్పంచ్‌ బి. గోవర్ధన్‌, ఎంపీయూపీఎస్‌ పాఠశాల హెచ్‌ఎం సుశీలబాయి, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.