విహార యాత్రలో విషాదం

ABN , First Publish Date - 2021-10-20T16:51:11+05:30 IST

విహార యాత్ర కాస్త విషాదంగా మారిన ఘటన కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిఽధిలోని సణాపురం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా వాసు

విహార యాత్రలో విషాదం

- ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

- మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు


బళ్లారి(karnataka): విహార యాత్ర కాస్త విషాదంగా మారిన ఘటన కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిఽధిలోని సణాపురం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దసరా సెలవులు కావడంతో హైదరాబాద్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు నలుగురు విజయనగర జిల్లా పరిధిలోని హంపి, కొప్పళ జిల్లా పరిధిలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చారు. వారి విహార యాత్రలో భాగంగా శనివారం కొప్పళ జిల్లా, గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర గ్రామానికి చేరుకుని సమీపంలోని రిసార్ట్‌లో విడిది చేశారు. ఆదివారం ఉదయం సణాపుర గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు చేరుకుని అక్కడే కారులోనే  రాత్రంతా గడిపారు. సోమవారం తెల్లవారు జామున మేల్కొన్న నలుగురు సమీపంలో ఉన్న చెరువులో ఈత కొడుతుండగా, ఉన్న ఫళంగా ఇద్దరు నీటిలో నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో మిగిలిన ఇద్దరు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయాన్ని ఆ ఇద్దరు మిత్రులు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో ముగిపోయిన ఇద్దరిని వెతికే సహాయ కర్యాక్రమాలు చేపట్టారు. ఎట్టకేలకు చెరువులో మృతిచెందిన వారిలో మధుకిరణ్‌ (25), రాజేష్‌ కుమార్‌(26)గా గుర్తించారు. వీరిలో ఇద్దరు నరసింహ, అలోక్‌ కుమార్‌ ప్రాణాలతో బయట పడ్డారు. ఈ మేరకు గంగావతి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-20T16:51:11+05:30 IST