పెద్దేరు పరవళ్లు

ABN , First Publish Date - 2021-10-18T05:56:43+05:30 IST

తంబళ్లపల్లె మండలంలోని కొటాల పంచాయతీ జుంజురపెంట వద్ద ఉన్న పెద్దేరు ప్రాజెక్టు సందర్శకులను కనువిందు చే స్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ పర్యాటకులతో కిటకిటలాడుతోంది.

పెద్దేరు పరవళ్లు

తంబళ్లపల్లె, అక్టోబరు 17: మండలంలోని కొటాల పంచాయతీ జుంజురపెంట వద్ద ఉన్న పెద్దేరు ప్రాజెక్టు సందర్శకులను కనువిందు చే స్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఇటీవల కురి సిన వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న నీటితో పెద్దేరు పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రాజెక్టు అందాలను తిలకిం చేందుకు జిల్లానుండే కాకుండా అనంతపురం, కడప జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. ప్రాజెక్టుపై నుంచి దూకుతున్న నీటిని చూసి మైమరిచి పోయారు. యువతీ యువకులు, విద్యార్థులు, పెద్దలు నీటిలో దిగి సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మొరవ నీటిలో జలకాలాడారు. పార్కులో చెట్ల కింద వనభోజనాలు చేసి సాయంత్రం వరకూ ఉల్లా సంగా గడిపారు. 

Updated Date - 2021-10-18T05:56:43+05:30 IST