అర్బన్‌ క్రూజర్‌

ABN , First Publish Date - 2020-08-12T05:56:50+05:30 IST

భారత్‌లో దూసుకుపోతున్న కార్ల విభాగం... కంపాక్ట్‌ ఎస్‌యూవీ. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) ఈ విభాగంలోకి అడుగు పెట్టింది. తమ తొలి కంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూజర్‌’ను రోడ్డెక్కించేందుకు...

అర్బన్‌  క్రూజర్‌

భారత్‌లో దూసుకుపోతున్న కార్ల విభాగం... కంపాక్ట్‌ ఎస్‌యూవీ. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) ఈ విభాగంలోకి అడుగు పెట్టింది. తమ తొలి కంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూజర్‌’ను రోడ్డెక్కించేందుకు సిద్ధమైంది. ప్రస్తుత పండుగల సీజన్‌లోనే దీన్ని విడుదల చేయనున్నామని ప్రకటించింది. ఈ నెల 22న బుకింగ్స్‌ ప్రారంభంకానున్నాయని తెలిపింది. మారుతి- టయోటా భాగస్వామ్యంతో వస్తున్న రెండో కారు ‘అర్బన్‌ క్రూజర్‌’. అయితే ఫీచర్లు ఏమేం ఉంటాయనేది సంస్థ వెల్లడించలేదు. 



ఇవీ హంగులు... 

  1. అందిన సమాచారం ప్రకారం ఈ మోడల్‌ ఆకర్షణీయమైన ‘అర్బన్‌ స్టాండవుట్‌ అప్పీల్‌’తో వస్తుంది. 
  2. గతంలో మారుతి ‘బలెనో’కు తమదైన మార్పులు చేసి ‘గ్లాంజా’గా ఆవిష్కరించిన టయోటా... ఇప్పుడు ‘విటారా బ్రెజా’కు హంగులద్ది ‘అర్బన్‌ క్రూజర్‌’గా విడుదల చేయనుందని నిపుణులు చెబుతున్నారు. 
  3. ‘అర్బన్‌ క్రూజర్‌’ యాంగ్యులర్‌ క్రోమ్‌ ఫ్రేమ్‌ టయోటా ఫార్చ్యునర్‌ను గుర్తుకు తెస్తుంది. 
  4. ముందు వైపు బంపర్‌కు తగిన కట్స్‌ అందించారు. ఇక మిగిలినదంతా మారుతి ‘విటారా బ్రెజా’నే తలపిస్తుందని లీకైనా ఫోటోలను బట్టి తెలుస్తోంది 
  5. ఇంటీరియర్స్‌ పరంగా కూడా టయోటా ఫీల్‌ను ఈ కంపాక్ట్‌ ఎస్‌యూవీకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. లైట్‌ కలర్స్‌, ఫ్రెష్‌ గ్రాఫిక్స్‌ జోడించారు. 
  6. టయోటా ‘గ్లాంజా’లో కనిపించినట్లుగానే టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. 
  7. ఇందులోని 1.5 లీటర్‌ కె-15 పెట్రోల్‌ ఇంజన్‌ 105 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. ఈ కొత్త మోడల్‌లో డీజిల్‌ వెర్షన్‌ ఉండకపోవచ్చని అంచనా. 
  8. గేర్‌ బాక్స్‌ తదితర ఫీచర్లు కూడా దాదాపు ‘బ్రెజా’లానే ఉండవచ్చు. 
  9. కాకపోతే హైబ్రీడ్‌ టెక్‌ ఫీచర్లకు ప్రసిద్ధమైన టయోటా ఈ కారులో సైతం అలాంటి ఫీచర్లను జోడించవచ్చని అంచనా.
  10. లీటరుకు 18 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు. 
  11. ధర సుమారు రూ.8 లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు. 


టయోటా అర్బన్‌ క్రూజర్‌ 

ప్రత్యేకతలు: 1.5 లీటర్‌ కె-15 పెట్రోల్‌ ఇంజన్‌, ఆధునిక టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆకట్టుకొనే ఎక్స్‌టీరియర్స్‌. 

ధర: సుమారు రూ.8 లక్షలు 


Updated Date - 2020-08-12T05:56:50+05:30 IST