అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం

ABN , First Publish Date - 2021-09-18T03:18:05+05:30 IST

అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం చేస్తామని

అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం

గజ్వేల్: అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం చేస్తామని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆధ్యర్యంలో సీఎం ఇలాకా గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్‌లో నిరుద్యోగుల కోసం ధర్మ యుద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు.30 లక్షల మందికి 33 నెలలుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి బాకీ ఉన్నాడన్నారు. కేసీఆర్‌కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాపార మెళుకువలను దళిత గిరిజన ప్రజలకు నేర్పాలన్నారు. సింగరేణి చిన్నారి హత్య కేసులో ఏడూ గంటలు పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. కేటీఆర్ ఆ కుటుంబము దగ్గరకి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు.


 నగరంలో ఏడు లక్షల కెమెరాలు ఉన్నాయి అని  చెప్పుకునే డీజీపీ నేరస్తుడిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఆయన నిలదీశారు. కేసీఆర్ మానవ మృగంగా మారాడన్నారు. హుజురాబాద్ ఎన్నికల గురించి మాత్రం సమీక్షలు చేయడానికి మాత్రం కేసీఆర్‌కి టైం ఉందని, కానీ చిన్నారి హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడం కోసం మాత్రం సమీక్ష చేయలేదని ఆయన మండిపడ్డారు. మరో 19 నెలల్లో రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-18T03:18:05+05:30 IST