Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదు: రేవంత్ రెడ్డి

కొడంగల్: ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ దగ్గర మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదును చేయిస్తామని టీపీసీస అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో  సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ  ప్రకటించిన రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోని అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన నియోజకవర్గంగా ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీని కొడంగల్‌కు తీసుకువస్తానన్నారు. అప్పుల తెలంగాణగా మార్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ లేదు, డబుల్ బెడ్ రూమ్ లేదు, రైతుల రుణమాఫీ లేదు, ఫీజు రియంబర్స్‌మెంట్ లేదన్నారు.


రెండు సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా నీటితో కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతా అని చెప్పిన కేసీఆర్ ఎక్కడికి పోయిండని ఆయన నిలదీశారు. కొడంగల్ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రతి దానిలో కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం తన గుండె లాంటిదన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 2018 వరకు తాను చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ డేటా అండ్ టెక్నాలజీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. Advertisement
Advertisement