టీఆర్ఎస్ చెరువుకు గండి: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-19T01:54:01+05:30 IST

టీఆర్ఎస్ అనే చెరువుకు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు

టీఆర్ఎస్ చెరువుకు గండి: రేవంత్ రెడ్డి

చేవెళ్ల: టీఆర్ఎస్ అనే చెరువుకు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కు ఇక చేవెళ్ల బస్టాండే గతి అని ఆయన ఎద్దేవా చేశారు. పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల కాంగ్రెస్‌కు అచ్చోచిందన్నారు. ఇక్కడ నుంచే పాదయాత్ర చేసామన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టినా అంటున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులకు అన్యాయం చేసారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన వాళ్ళు అబివృద్ధి కోసం పార్టీ మారినం అంటున్నారని, వాళ్ళను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.


ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని కేసీఆర్ అన్నాడని, అగ్గి పుట్టియ్యలేదు కానీ ఫామ్ హౌస్‌లో పడుకొని పెగ్గు తాగిండన్నారు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. 



బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు..


ప్రధాని మోడీ ఆధ్యర్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. దేశంలో 2014లో రూ.60 ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు రూ.108 అయ్యిందని రేవంత్ ఆరోపించారు. 400 ఉన్న సిలిండర్ వెయ్యి రూపాయలు చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో చేతిలో డబ్బు ఉంటే సంచి నిండా సరుకులు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు సంచిలో డబ్బు తీసుకొనిపోతే చేతిలో సరుకులు వస్తున్నాయన్నారు. మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడన్నారు. అంటే ఇప్పటికీ 14 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30 లక్షల కోట్లు దోచుకున్నాయని ఆయన ఆరోపించారు. పండించిన పంటలకు ధరలు లేవన్నారు. వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-12-19T01:54:01+05:30 IST