సీఎం గారూ.. శ్వేతపత్రం విడుదల చేయండి: మల్లు రవి

ABN , First Publish Date - 2021-09-08T00:29:31+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో

సీఎం గారూ.. శ్వేతపత్రం విడుదల చేయండి: మల్లు రవి

హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం తెలంగాణ బిల్లులో పెట్టారని గుర్తుచేశారు. కానీ ఏడేళ్ళల్లో కేసీఆర్ ఒక్కసారి కూడా ఈ అంశంపై చర్యలు తీసుకోలేదన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే తెలంగాణలో గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.


బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కూడా బిల్లులో ప్రస్తావించారని..  ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుంటే.. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. అలాగే ఐఐఎం ఏర్పాటు అంశాన్ని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే.. రాష్ట్రంలో ఉద్యోగాలతో పాటూ ఉత్పత్తి కూడా జరిగేదని చెప్పారు. అదేవిధంగా దళిత, గిరిజనులకు ఆత్మగౌరవం పెరిగేదన్నారు.


ఐటీఐఆర్‌ను యూపీఏ ప్రభుత్వం.. 2011లోనే మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. అలాగే 18 కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకొచ్చినట్లు తోలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక.. అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. వారం రోజుల నుంచి కేసీఆర్.. ఢిల్లీలో ఉన్నారని, ఈ పనులపై కేంద్రంపై ఎందుకు వత్తిడి తేలేదని ప్రశ్నించారు. సీఎంగా కొనసాగే నైతిక హక్కు.. కేసీఆర్‌కు లేదని మల్లు రవి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-08T00:29:31+05:30 IST