30శాతంతో ఆపేస్తారా?

ABN , First Publish Date - 2020-10-29T08:26:38+05:30 IST

సజ్జ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేయడంతో రైతులు ఆందోళన పడుతున్నారు.

30శాతంతో ఆపేస్తారా?

సజ్జ కొనుగోళ్లపై రైతుల ఆందోళన

 

పుత్తూరు, అక్టోబరు 28: సజ్జ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేయడంతో రైతులు ఆందోళన పడుతున్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన 42,790 క్వింటాళ్ల సజ్జలు నగరి నియోజకవర్గంలో పేరుకుపోయి వున్నాయి. 30 శాతం ధాన్యాన్ని మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం సేకరించింది.ప్రభుత్వం పచ్చ జెందా ఊపితే కానీ  మిగిలిన ధాన్యం రైతుల ఇళ్లనుంచి బయటకు కదిలే అవకాశం కన్పించడం లేదు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు పది నుంచి 12 క్వింటాళ్ల  దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 2150 రూపాయల ధరను చూసి రైతుల కళ్లలో ఆనందం కన్పించింది.సేకరణలో కూడా యాభై కిలోల బస్తాకు రెండు కిలోలు అదనంగా అధికారులు తీసుకున్నారు.


అలాగే గోనెసంచికి 25 రూపాయలు, ధాన్యం కొలత, కూలీలకు కలిపి 150 రూపాయలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వెలుగు కార్యకర్తల ద్వారా వాపసు చేస్తామని చెప్పినప్పటికీ తిరిగివ్వడం తేదని రైతులు చెబుతున్నారు.ఎకరా సాగుకు దాదాపు పదివేలు ఖర్చు చేసిన రైతులు  30 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో లబోదిబోమంటున్నారు.  ఈ పరిస్థితిని గమనించిన వ్యాపారులు ధాన్యం ధరను బాగా తగ్గించి అడుగుతుండడంతో రైతులు నిస్సహాయులై చూస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మరో 50 శాతం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే భారీగా నష్టపోతామని సజ్జ రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై నగరి ఏడీ సౌభాగ్యలక్ష్మిని వివరణ కోరగా నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో సేకరణ బాగా జరిగిందని, విజయపురంలో మాత్రం ధాన్యం ఎక్కువగా నిలిచి వుందన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక పంపామని,త్వరలోనే అనుకూలమైన ఆదేశాలు వస్తాయని ఎదురు చూస్తున్నామన్నారు.



మండలం     విస్తీర్ణం   దిగుబడి    సేకరించిన ధాన్యం   రైతుల వద్ద నిల్వ

              ఎకరాల్లో  క్వింటాళ్లలో  క్వింటాళ్లలో            క్వింటాళ్లలో    

----------------------------------------------------------------------------------------

పుత్తూరు          232     2320       470                1850

వడమాలపేట       85      850      ----                  850

నగ రి             422     4220      1500                2720

విజయపురం      1915    19150      3000               16150

నిండ్ర           1625     16250      7000                9250

             --------------------------------------------------

                4279     4279       11970               30820

             ---------------------------------------------------

Updated Date - 2020-10-29T08:26:38+05:30 IST