Abn logo
Oct 29 2020 @ 01:20AM

కలెక్టరేట్‌ ఎదుట టీపీటీఎఫ్‌ నిరసన

సుభాష్‌నగర్‌, అక్టోబరు 28: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రొగ్రెస్సివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండిపెల్లి పర్శరాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018మే 16న ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీలు, పీఆర్సీ అమలు, పెండింగ్‌ డీఏ, ప్రమోషన్స్‌ లాంటి సుమారు 25హామీలు ఇచ్చారని అన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదలని అన్నారు. వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలుగూరి కిషన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు, జిల్లా ప్రధానకార్యదర్శి జంకె రాంచంద్రారెడ్డి, రాష్ట్ర, జిల్లా సభ్యులు వీరగోని పెంటయ్య, గడ్డం రాజనర్సు, గడ్డం చంద్రమౌళి, సారభద్రస్వామి, చంద్రశేఖర్‌, శాంతిరాజ్‌, మోహన్‌ నాయక్‌, రవీందర్‌, యూసుఫొద్దీన్‌, రాజశేఖర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, దేవశంకర్‌, తిరుపతి, బాబన్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement