విద్యుత్‌ విజిలెన్స్‌ విస్తృత తనిఖీలు

ABN , First Publish Date - 2020-12-04T05:57:09+05:30 IST

విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు నవంబరులో విస్తృత తనిఖీలు నిర్వహించి 750 మందిపై కేసులు నమోదు చేసి రూ.2.28 కోట్లు అపరాధ రుసుం వసూలు చేసినట్లు ఈఈ విజయకృష్ణ, డీపీఈ కేవీఎల్‌ఎన్‌ మూర్తి సంయుక్త ప్రకటనలో తెలిపారు.

విద్యుత్‌ విజిలెన్స్‌ విస్తృత తనిఖీలు

గుంటూరు, డిసెంబరు 3: విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు నవంబరులో విస్తృత తనిఖీలు నిర్వహించి 750 మందిపై కేసులు నమోదు చేసి రూ.2.28 కోట్లు అపరాధ రుసుం వసూలు చేసినట్లు ఈఈ విజయకృష్ణ, డీపీఈ కేవీఎల్‌ఎన్‌ మూర్తి సంయుక్త ప్రకటనలో తెలిపారు. మీటర్‌ లేకుండా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడటం, అక్రమ విద్యుత్‌ చౌర్యం, అనధికార కేటగిరీలో వినియోగం, అదనపు లోడు వినియోగం వంటి సర్వీసులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడటం నేరమని 9440812263, 8331021847లకు సమాచారం అందించాలని కోరారు. 


Updated Date - 2020-12-04T05:57:09+05:30 IST