Abn logo
Sep 25 2021 @ 00:42AM

కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాల ధర్నా

మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 24: స్కీం వర్కర్లకు భద్రత కల్పించాలని, కేంద్రం స్కీముల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. కార్మికుల డిమాండ్ల సాధనకు శుక్రవారం జిల్లా కేం ద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా అఖిల పక్ష కార్మిక సంఘల నాయకులు తిరుపతి నాయక్‌, చింత భూమేష్‌ మాట్లాడుతూ స్కీ వర్కర్లకు కనీస వేతనం రూ. 21 వేలు అమలు చేయాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్‌ అమలు చే యాలని వారు డిమాండ్‌ చేశారు. 4కోడ్‌ లేబర్‌ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోకన్వీన ర్‌ ఇందూరి సులోచన, అంగన్‌వ్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అధ్యక్ష కార్యదర్శులు శైలజ, రజిత, ఆశ సంఘం జిల్లా అధ్యక్షురాలు లత, క స్తూర్భా జిల్లా కార్యదర్శి లక్ష్మీ ఉన్నారు.

 మెట్‌పల్లి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవా రం అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెట్‌పల్లి మార్కెట్‌ రోడ్‌ నుంచిసబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు భా రీ ర్యాలీ నిర్వహించారు. 6 మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచ ర్స్‌, హెల్పర్స్‌, మధ్యాహ్న భోజన వర్కర్‌లు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాల య ఉద్యోగికి వినతి పత్రం అందజేశారు. అంగన్‌ వాడీ టీచర్లకు వెం టనే టీఎ, డీఎలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్‌లకు కనీస వేతనం చెల్లించడంతో పాటు ప్రతి నెల 5 వ తేదిలోగా మెస్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, నాయకులు రాజలింగం, సాయిశ్వరి, స రస్వతి, భాగ్యలక్ష్మీ, లక్ష్మీనర్సు, పద్మ, రజిత ఉన్నారు.