Abn logo
Sep 24 2021 @ 00:51AM

రోడ్డు ప్రమాదంలో వ్యాపారికి గాయాలు

గార్లదిన్నె, సెప్టెంబరు 23 : మండల పరిధిలోని తలగాసిపల్లి క్రాస్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్రప్రసాద్‌ అనే నిమ్మకాయాల వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. అందిన వివరాల మేరకు... ప్రకాశం జిల్లా కనిగిరి గ్రామానికి చెందిన వర్రప్రసాద్‌ కొద్దిరోజులు గా గార్లదిన్నెలో నివాసముంటున్నాడు. తిమ్మంపేట గ్రామంలో నిమ్మతోట లీజుకు తీసుకుని నిమ్మకాయల వ్యాపారం చేస్తున్నా డు. రోజూ మాదిరి గానే గురువారం తోట వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహ నంలో గార్లదిన్నెకు వెళ్తుండగా తలగాసిపల్లి క్రాస్‌ వద్దకు రాగానే హైదారాబాదు నుంచి అనంతపురానికి వస్తు న్న బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వర్రప్రసాద్‌ను 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వాస్ప త్రికి తరలించారు. పరిస్థితి విషమింగా ఉండ డంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.