Abn logo
Apr 8 2021 @ 00:38AM

కార్వీ మదుపర్లకు ట్రేడింగ్‌ వెసులుబాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇప్పటి వరకూ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ వద్ద డీమ్యాట్‌ ఖాతాలు కలిగిన మదుపర్లు ఇక ట్రేడింగ్‌ చేసుకునే వెసులుబాటు లభించనుంది. కార్వీ వద్ద ఇప్పటి వరకూ డీమ్యాట్‌  ఖాతాలు కలిగిన మదుపర్లు ఇక తమ ప్లాట్‌ఫారమ్‌పై ట్రేడింగ్‌, మదుపు చేసుకోవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్‌ఎల్‌ నుంచి బిడ్డింగ్‌ ద్వారా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు చెందిన 11 లక్షల డీమ్యాట్‌ ఖాతాలను ఐఐఎఫ్‌ఎల్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ 11 లక్షల డీమ్యాట్‌ ఖాతాల్లో రూ.3 లక్షల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఈ ఖాతాలపై తొలి ఏడాది వార్షిక మెయింటినెన్స్‌ కాంట్రాక్టు ఛార్జీలను కూడా రద్దు చేస్తున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ సీఈఓ సందీప్‌ భరద్వాజ్‌  తెలిపారు. 


మ్యూచువల్‌ ఫండ్‌ కమిషన్లు నిలిపివేత:  గత మూడు నాలుగు నెలలుగా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ వద్ద సబ్‌ బ్రోకర్లుగా ఉన్న వారికి మ్యూచువల్‌ ఫండ్‌ కమిషన్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సబ్‌ బ్రోకర్లు విక్రయించిన మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములకు కార్వీ కమిషన్లు పొందుతున్నప్పటికీ అవి సబ్‌ బ్రోకర్లకు లభించడం లేదని చెబుతున్నారు. కార్వీ నుంచి ఎన్‌ఓసీ లేనిదే సబ్‌ బ్రోకర్లకు మ్యూచువల్‌ ఫండ్‌లు నేరుగా కమిషన్లను చెల్లించడానికి వీలు లేదు. 

Advertisement
Advertisement
Advertisement