Abn logo
Sep 27 2021 @ 00:25AM

సంప్రదాయబద్ధంగా లక్ష్మీగణపతి హోమం

హోమంలో పాల్గొన్న శ్యామ్‌ప్రసాద్‌ తదితరులు

 పాల్గొన్న ఐఏఎస్‌ అధికారి శ్యామ్‌ప్రసాద్‌

 నూకాంబికను దర్శించుకున్న అడిషినల్‌ ఎస్పీ, డీఎస్పీ  

అనకాపల్లిటౌన్‌, సెప్టెంబరు 26: స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయం లో ఆదివారం పంచమి కృత్తిక నక్షత్రం సందర్భంగా ఆలయ బేడా మండపంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. ఆలయ ఈవో బీఎల్‌ నగేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన హోమంలో ఐఏఎస్‌ అధి కారి, రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయ జాయింట్‌ కార్యదర్శి ఆడారి శ్యామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే ఓఎస్‌డీ, అడిషినల్‌ ఎస్పీ సతీష్‌కుమార్‌, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ అమ్మ వారిని దర్శించుకున్నారు. అధికారులకు ఈవో బీఎల్‌ నగేశ్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రసాదాన్ని అందజేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో అమ్మవారి దర్శనానికి అధికసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు.