అమ్మో.. ఇన్ని చలాన్లా..!

ABN , First Publish Date - 2021-11-17T16:15:15+05:30 IST

ఓ ద్విచక్ర వాహనంపై ఉన్న చలాన్లను చూసి పోలీసులే నివ్వెరపోయారు. భారీ స్థాయిలో చలాన్లు ఉండడంతో వెబ్‌ పోర్టల్‌ పేజీ కూడా సరిపోలేదు. ఆబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన మహ్మద్‌

అమ్మో.. ఇన్ని చలాన్లా..!

ఆ వాహనంపై చాంతాడంత లిస్టు 

సరిపోని వెబ్‌పోర్టల్‌ పేజీ

హైదరాబాద్/మంగళ్‌హాట్: ఓ ద్విచక్ర వాహనంపై ఉన్న చలాన్లను చూసి పోలీసులే నివ్వెరపోయారు. భారీ స్థాయిలో చలాన్లు ఉండడంతో వెబ్‌ పోర్టల్‌ పేజీ కూడా సరిపోలేదు. ఆబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో (ఏపీ09ఏయూ1727) హోండాయాక్టీవా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నాంపల్లి స్టేషన్‌ రోడ్డులోని కలెక్టర్‌ కార్యాలయం గుండా వెళ్తుండగా, ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనంపై 117 చలాన్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. రూ. 29 వేల జరిమానా చెల్లించాల్సి ఉంది. దీంతో పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. 2014 నుంచి వాహనంపై చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్ల వెబ్‌పోర్టల్‌ పేజీలో కేవలం 75 చలాన్ల వరకే కనిపిస్తాయి. పోలీసులు సాంకేతికత సహాయంతో పూర్తి చలాన్లను గుర్తించారు. 

Updated Date - 2021-11-17T16:15:15+05:30 IST