Abn logo
Oct 24 2021 @ 14:39PM

HYD : TRS ప్లీనరీ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు..

హైదరాబాద్‌ సిటీ : హైటెక్స్‌లో సోమవారం నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా హైటెక్స్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నీరూస్‌ జంక్షన్‌, సైబర్‌ టవర్‌ క్రాస్‌రోడ్స్‌, మెటల్‌ చార్మినార్‌, గూగుల్‌ జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్‌, ఖానామెట్‌ జంక్షన్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి బొటానికల్‌గార్డెన్‌ జంక్షన్‌ల వద్ద మళ్లింపులుంటాయన్నారు. 


- నీరూస్‌ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌, దుర్గంచెరువు, ఇనార్బిట్‌, ఐటీసీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ వైపు మళ్లిస్తారు.

- మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌కు వెళ్లే వాహనదారులను రోలింగ్‌ హిల్స్‌, ఏఐజీ ఆస్పత్రి, ఐకియా, ఇనార్బిట్‌, దుర్గం చెరువు మీదుగా పంపుతారు.

- ఆర్‌సీపురం, చందానగర్‌ నుంచి మాదాపూర్‌, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ. ఐఐఐటీ, గచ్చిబౌలి వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

- టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.


హైదరాబాద్మరిన్ని...